TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్ గా ఎన్నికైన బీఆర్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. తనకు టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ హైకమాండ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంటలోగా తిరుమల శ్రీవారి దర్శనాలు కావాలనేదే తన లక్ష్యమని తెలిపారు.
Also Read: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు!
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడితో పాటు కొత్త పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం బుధవారం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు.. శ్రీవారి ట్రస్టును రద్దు చేయాలని తన అభిప్రాయమని అన్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో గతంలో ఉన్నట్లు టోకెన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
Also Read: బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ నంబియార్ కన్నుమూత...చంద్రబాబు సంతాపం!
పాలు, అల్పాహారం...
మెటీరియల్ సప్లై, దేవస్థానం భూములపై ప్రత్యేక కమిటీలు వేసి విచారణ చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. స్వామి వారి భక్తులను ఎక్కువసేపు కంపార్టుమెంట్లలో ఉంచడం మంచిది కాదని.. అందువల్ల చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ఐదేళ్లు కంపార్టుమెంట్లలో ఉన్న పిల్లలకు పాలు ఆహారం కూడా ఇవ్వలేదని.. కొత్త ప్రభుత్వం వచ్చాక పాలు, అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
యూనివర్సిటీ, హాస్పిటల్స్‌పై తాను దృష్టి సారిస్తానని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. పేపర్ గ్లాస్‌లో ఉచితంగా తాగునీరు ఇవ్వాలనేది తన ఆలోచన అని పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్ కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ నాయుడు అన్నారు.
Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే
గత ప్రభుత్వం తిరుమలలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. తిరుమలలో పని చేసేవారంతా హిందువులే అయి ఉండాలని టీటీడీ ఛైర్మన్ అన్నారు. తిరుమలలో వ్యర్థాల నుంచి దుర్గంధం వస్తోందని.. వాటిని తొలగించాల్సి ఉందని వివరించారు. తిరుమలలో నీటి దందాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే తాను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగి.. చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్ప వేరే ఆలయాలకు వెళ్లేవాడిని కాదని, కానీ గత ప్రభుత్వం వల్ల తిరుమలలో చాలా అరాచకాలు జరిగాయి. అందువల్ల తిరుమల పవిత్రత పాడయ్యింది. అందుకే గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమల వెళ్లలేదని చెప్పారు. గతంలో ఏడాదికి ఐదారుసార్లు వెళ్లేవాడిని అని.. అలాంటిది గత 5 ఏళ్లు వెళ్లలేకపోవడంతో తాను చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నా తర్వాత.. సీఎం చంద్రబాబును కలిసి ఆయన సలహాలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.