తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల నూతన పాలక మండలిని ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఛైర్మన్‌గా బీఆర్ నాయుడుతో పాటు మరో 23 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే తాజాగా టీటీడీ మరో జాబితాను విడుదల చేసింది. అందులో బీజేపీ నేత జీ. భానుప్రకాశ్ రెడ్డి పేరును చేర్చారు.
ఇటీవల ప్రకటించిన టీటీడీ సభ్యులు వీళ్లే
పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
జాస్తి పూర్ణ సాంబశివరావు
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)
జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక)
శాంతారామ్
పి.రామ్మూర్తి (తమిళనాడు)
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
శ్రీసదాశివరావు నన్నపనేని
బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
కృష్ణమూర్తి ( తమిళనాడు)
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
నరేశ్‌కుమార్ ( కర్ణాటక)
డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)
జంగా కృష్ణమూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
Also Read: వెన్నెల కుటుంబానికి పవన్ భరోసా.. వారిపై కఠిన చర్యలు!
ఇదిలాఉండగా.. ఈ టీటీడీ పాలకమండలి సభ్యుల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి రెండు, గుజరాత్,మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికీ పాలకమండలిలో చోటు దక్కింది. టీటీడీ పాలకమండలిలో మొత్తం 25 మంది సభ్యులు ఉంటారు. ఇటీవల 24 మంది పేర్లను ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మిగిలిన సభ్యుడి పేరును ప్రకటించారు.