Pawan: వెన్నెల కుటుంబానికి పవన్ భరోసా.. వారిపై కఠిన చర్యలు!

శ్రీ షిరిడిసాయి విద్యానికేతన్ స్టూడెంట్ వెన్నెల కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. మధురపూడి విమానాశ్రయంలో పవన్ కు మృతురాలు వెన్నెల పేరెంట్స్ వినతి పత్రం ఇచ్చి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో బాధితులను కఠినంగా శిక్షిస్తామన్నారు పవన్.

New Update
ap dept cm

Pawan kalyan: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెన్నెల కుటుంబానికి న్యాయం చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భరోసా ఇచ్చారు. ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ తో 10వ తరగతి చదువుతున్న వెన్నెల.. దసరా సెలవులు ఇవ్వలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో స్కూల్ యాజమాన్యం వేధింపులకు గురిచేయగా గతనేల 18న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వెన్నెల మృతికి స్కూల్ యాజమాన్యం బెదిరింపులే కారణమని, తల్లిదండ్రులు విద్యాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం మధురపూడి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన తల్లిదండ్రులు.. వినతి పత్రం ఇచ్చి తమ మొరను వినిపించారు. 

కుటుంబానికి న్యాయం జరుగుతుంది..

దీంతో తిరుగు ప్రయాణంలో కలుస్తానని OSDద్వారా కుటుంబ సభ్యులకు చెప్పారు పవన్. ఏలూరు పర్యటన ముగించుకుని తిరిగి వస్తూ విమానాశ్రయంలో వెన్నెల కుటుంబ సభ్యులను కలిసిన పవన్..  వెన్నెల ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసుపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కాగా తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వెన్నెల కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు విచారణ చేపట్టి, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని వెన్నెల తల్లిదండ్రులు కోరుతున్నారు. వెన్నెల మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు