TTD: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా మొబైల్ స్క్వాడ్ బృందాలను అధికారులు నియమించారు.
మట్టిపెళ్లలు విరిగి...
ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలేన్స్ సిబ్బందితో కూడిన టీంలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డును నిరంతరాయంగా ఈ మొబైల్ స్క్వాడ్ టీంలు తనిఖీ చేయనున్నాయి. అయితే, రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ మట్టిపెళ్లలు విరిగిపడ్ఢాయి. ఇక, జేసీబీల సాయంతో మట్టి పెళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే, మరోవైపు తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి గుడి తర్వాత సెకండ్ మలుపు దగ్గర రోడ్డుపై బండరాళ్లు విరిగి పడ్డాయి.
Also Read: ఒమర్ అబ్దుల్లాతో కలిసి పనిచేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వెంటనే అలర్టైన టీటీడీ అధికారులు యుద్ద ప్రాతిపదికన బండరాళ్ళను తొలగించేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాహన దారులు అలర్టుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.
Also Read: ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండం బలపడింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని , ఇది గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
Also Read: స్పా సెంటర్‌గా మారిన స్కూల్... పిల్లలతో ఇదేం పాడుపని?
దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో రేపు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని తెలిపింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, గరిష్ఠంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Also Read: ఆమ్రపాలి ఔట్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి
మంగళవారం ఉదయం నెల్లూరులో అత్యధిక వర్షపాతం కావలిలో 15 సెం.మీగా నమోదైంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంతో ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి అనిత ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచాలని హోం మంత్రి సూచించారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు ఆమె తెలిపారు.
తాడేపల్లి విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉండి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. దీంతో పాటూ చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం ఉన్నంత వరకూ బయటికి వెళ్లకూడదని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.