/rtv/media/media_files/2025/02/21/0uww2w0eyVduDnSmWgqd.jpg)
Actor Prithvi trolls YS Jagan and sings song from Rangasthalam movie
నటుడు పృథ్వీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కాంట్రవర్సియల్ కామెంట్స్‌తో చిక్కుల్లో ఇరుక్కుంటున్నాడు. ఇటీవలే విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వివాదంలో చిక్కుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి వైఎస్ జగన్‌పై ట్రోల్ చేస్తూ ఓ సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది.
జగన్‌పై ట్రోల్ సాంగ్
రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీలోని సాంగ్ లిరిక్స్‌కు తన సొంత లిరిక్స్‌తో జగన్‌ని ట్రోల్ చేస్తూ సాంగ్ పాడాడు. ‘‘ఈ చేతితోనే పథకాలు పెట్టాను.. ఈ చేతితోనే డబ్బులు పంచాను.. ఈ చేతితోనే బటన్లు నొక్కాను.. ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను.. ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా.. ఓరయ్యో నా అయ్య’’ అంటూ పాడాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ ఫ్యాన్స్ నటుడు పృథ్వీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చూడాలి మరి ఈ కాంట్రవర్సియల్ సాంగ్ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో.
మళ్ళీ వచ్చేశాడు
— BoyFromBezawada (@GoCoronaGo) February 21, 2025
ఈ పాట రిలీజ్ చేస్తే @ysjagan కి బ్రేక్ ఇస్తాం
2029లో 9 వచ్చేలా చేస్తాం pic.twitter.com/n6iDmtiUn2
లైలా వివాదం
ఇటీవల ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ పార్టీ 11 సీట్లపై అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ‘బాయ్‌కట్ లైలా’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. అనంతరం మూవీ హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపటి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరుకున్నారు. ఒకరు చేసిన తప్పుకు అందరినీ నిందించడం సరికాదని అన్నారు.
అది తమకు తెలియకుండా జరిగిందని.. తాము అక్కడ లేని సమయంలో అతడు అలా మాట్లాడాడని అన్నారు. ఒకవేళ తాము అక్కడ ఉన్నట్లయితే అతడి చేతిలో ఉన్న మైక్ లాక్కునే వాళ్లమని చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్స్ సైతం చెలరేగిపోయారు. దీంతో పృథ్వీ పోలీస్ కంప్లైంట్ సైతం ఇచ్చాడు. కాల్స్, మెసేజెస్ చేస్తూ తనను టార్చర్ పెడుతున్నారంటూ అతడు ఫిర్యాదు చేశాడు. మరి ఈ కాంట్రవర్సియల్ సాంగ్ పై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.