Janasena: జనసేన వినూత్న ప్రచారం..!
తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. గాజు గ్లాసును ప్రజలకిస్తూ గ్లాస్ పై తమ ఓటు వేసి జనసేన అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. గాజు గ్లాసును ప్రజలకిస్తూ గ్లాస్ పై తమ ఓటు వేసి జనసేన అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిపై లోకేష్ చేసిన ట్వీట్ పలు అనుమానాలకు దారి తీస్తోందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇది ముమ్మాటికి టీడీపీ చేసిన దాడే అని ఆరోపించారు. సీఎం జగన్ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి టీడీపీ నేతలతో జరిపిన భేటీ సఫలం అయ్యింది. దాదాపు గంటపాటు ఆయన సుదీర్ఘంగా మాట్లాడిన తీరుతో టీడీపీ ముఖ్యనాయకులు శాంతపడినట్లే కనిపించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి పనిచేసేందుకు సూత్రప్రాయంగా వారంతా అంగీకారం తెలిపారు .
తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదారలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ ఇచ్చారు. అతని వైఖరిపై అనుమానంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు సీఎం రమేష్. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ లో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీ లో ఎవరు మిగలరని పేర్కొన్నారు.
పోతిన మహేశ్‌పై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తన రాజకీయ జీవితం జనసేనలో నేనని, వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఎవరైనా తన చెయ్యి నరికేయవచ్చంటూ గతంలో మహేశ్ అన్నారని, మరి ఇప్పుడు ఆయన ఏ చేయి నరుక్కుంటారని కిరణ్ ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు గుడ్ స్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేలు పారితోషికం ఇస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఇటుకుల బట్టి కూలి పనికి వెళ్ళిన మైనర్ బాలికపై బట్టి యజమాని గణేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన మైనర్ బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చంద్రబాబు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెబుతున్నాడని విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేయాలంటే రూ. 2. 50 లక్షల కోట్లు కావాలన్నారు. తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత మాటలను నమ్మి మోసపోద్దని ప్రజలను కోరారు.