NHAI: ఫాస్టాగ్ లేకపోతే...టోల్ రెట్టింపు
వాహనాల మీద ఇక మీదట ఫాస్టాగ్ కనిపించకపోతే బాదుడే అంటోంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఎన్హెచ్ఐ నిర్ణయించింది. టోల్ గేట్ల దగ్గర రద్దీని నియంత్రించడానికే ఈ చర్యలను చేపట్టామని తెలిపింది.