Ponnavolu Sudhakar Reddy: తిరుమల లడ్డూ వివాదంలో న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆసక్తికర అంశం లేవనెత్తారు. కేజీ రూ.1,400 ఉన్న పంది కొవ్వు రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. పంది కొవ్వు కేజీ రూ.450 నుంచి రూ.1,400 వరకు ఉంటుందని, అంతటి ఖరీదైన నెయ్యిని రూ.320కి సరఫరా చేసే నెయ్యిలో ఎలా కల్తీ చేస్తారని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా? రాగి చెంబులో ఎవరైనా బంగారాన్ని కలుపుతారా? నెయ్యి కంటే పంది కొవ్వు రేటు చాలా ఎక్కువ. పంది కొవ్వు వాల్యూ తగ్గిందంటే కల్తీ జరిగిందని అర్థం. కానీ ఆ కల్తీ పంది కొవ్వు కాదన్నారు. ఈ ఇష్యూలో నిజానిజాలు వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు.
ల్యాబులు లేవన్నది పచ్చి అబద్ధం..
అలాగే ఏపీ ప్రభుత్వం వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ ఉందని చెబితే ఆయన కింద పనిచేసే ఏజెన్సీలన్నీ అవే చెబుతాయి. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరుతామని చెప్పారు. ఇక ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకుల్లో నాలుగు ట్యాంకుల్లో కల్తీ ఉందని.. ఈ ట్యాంకుల్లో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని పొన్నవోలు గుర్తు చేశారు. ట్యాంకులు ఒక సర్టిఫికెట్‌తో తిరుమలకు వస్తాయని, వాటిని టీటీడీ 3సార్లు పరీక్షించిన తర్వాతే లడ్డూల తయారీకి వినియోగిస్తారని చెప్పారు. తిరుమలలో నెయ్యిని టెస్టు చేసే ల్యాబులు లేవని చెబుతున్నది పచ్చి అబద్ధం. అక్కడ ల్యాబులు ఉన్నాయని అన్నారు.