Tirupati Laddu: తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే వివాదం కోట్లాది శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని టీడీపీ ఆరోపణలు చేసింది. కావాలని కుట్ర చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఈ అంశంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించింది.
సీన్‌లోకి ఇండియా టుడే ...
తిరుపతి లడ్డూలో అసలు జంతు కొవ్వు కలిసిందా? లేదా? అని బట్టబయలు చేసేందుకు రంగంలోకి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే దిగింది. ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై నిగ్గుతేల్చేందుకు శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ తో కలిసి పని చేసింది. అక్టోబర్ 17న శాంపిల్స్ తిరుపతి లడ్డూ శాంపిల్స్ ను శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తీసుకున్నారు. దీనిపై పరిశోధనలు నిర్వహించి, తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదా వెజిటబుల్ ఫ్యాట్ లేదని తేల్చి చెప్పారు.
Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!
కాగా ఈ వార్త భక్తులకు కాస్త ఉరటనిస్తుందనే చెప్పాలి. అయితే.. కల్తీ జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన నెయ్యినే వాడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే పరీక్షల్లో ఎలాంటి కల్తీ జరగలేదని వచ్చిందని అంటున్నారు.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
Also Read: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..!