Tirupati laddu: తిరుపతి లడ్డూ కల్తీపై నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యుల గల బృందం ఇప్పటికే తిరుమల చేరుకుంది. హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళి రంభ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఏపీ పోలీస్ శాఖ నుంచి విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ సభ్యులుగా నియమించింది. ఎస్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మరో సభ్యుడని ప్రకటించాల్సి ఉంది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ బృందం విచారణ చేస్తోంది. తిరుమల శ్రీవారి కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై విచారణ బృందం ఆరా తీస్తోంది. నెయ్యి యొక్క కల్తీ రేటెడ్ నమూనాలపై ప్రయెగశాల నివేదికలను సిట్ పరిశీలిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి సిట్ రెడీ అవుతోంది.
ఇది కూడా చదవండి: US President: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే!
కీలక ఆదేశాలు జారీ..
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపాలని సుప్రీం కోర్టులో పలువురు ప్రముఖులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిట్ టీమ్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. అలాగే స్వతంత్ర సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!
ఇది ఇలా ఉంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి... జంతు కొవ్వు ఉందా లేదా అన్నది విచారణ బృందం తేల్చవలసి ఉంది.