అందరికీ అందుబాటులో క్యాన్సర్ చికిత్స: ఎంపీ సానా సతీష్

క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, అందరికీ చేరువగా నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ కె. కృష్ణయ్యతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు.

New Update
MP Sana Satheesh babu

క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, అందరికీ చేరువగా నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ కె. కృష్ణయ్యతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ.. కాకినాడలో ఏర్పాటు చేయబోయే క్యాన్సర్ రేడియేషన్ కేంద్రానికి సాంకేతిక, వైద్య సహకారం  అందించడం, అలాగే జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ రేడియేషన్ కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డి హత్యకు స్కెచ్?

ఇదిలా ఉంటే.. ఇటీవల కొందరు కేటుగాళ్లు ఇటీవల "బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్" పేరిట వసూళ్లకు దిగారు. ఈ విషయం బాలకృష్ణ దృష్టికి వెళ్లడంతో స్పందించారు. ఈ విషయమై ప్రజలను అలర్ట్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి తనతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నాడన్నారు.

ఈ ఈవెంట్‌కు తన అనుమతి లేదని స్పష్టం చేశారు బాలకృష్ణ. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదన్నారు. ప్రజలు ఇలాంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారా మాత్రమే బసవతారకం హాస్పిటల్ తరఫున అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు నిర్వహించబడతాయన్నారు. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!

ప్రస్తుతం బాలకృష్ణ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పార్లమెంట్ ను సందర్శించారు. అయితే.. ఈ సందర్భంగా అక్కడ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎంట్రీ గేటు పక్కనే పర్కింగ్ లో ఉన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ ను ఆయన చూశారు. వెంటనే సైకిల్ వద్దకు వెళ్లి ఎంపీతో మాట్లాడారు. కాసేపు సైకిల్ పై కూర్చొని సందడి చేశారు. సైకిల్ చూడగానే తన తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చారని బాలయ్య ఈ సందర్భంగా అన్నారు. 

Advertisment
తాజా కథనాలు