/rtv/media/media_files/2025/08/14/tdp-2025-08-14-11-14-11.jpg)
జగన్ కంచుకోట పులివెందులలో అధికార టీడీపీ సత్తా చాటింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డికి 6,735 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు వచ్చాయి.1978 నుంచి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 1995, 2001, 2006, 2021 ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మద్దతుతో జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తోంది. వైఎస్ ఫ్యామిలీకి ఈ ప్రాంతం కంచుకోట కావడంతో నామినేషన్ కు కూడా ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు. 2016లో అధికారంలో ఉన్న సమయంలో తొలిసారి అక్కడ అభ్యర్థిని నిలిపేందుకు టీడీపీ ప్రయత్నించింది. నామినేషన్ల విత్ డ్రా తర్వాత ఆ పార్టీ అభ్యర్థి హ్యాండిచ్చి వైసీపీ కండువా కప్పుకున్నాడు.అయినా టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య 2500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2021లో పులివెందుల జడ్పీటీసీగా వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడాదిన్నర క్రితం శివరాత్రి సంబరాల్లో ఎడ్లబండిపై నుంచి పడి మృతి చెందాడు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. దీంతో మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ బరిలోకి దించింది.
ఉమ్మడి ఏపీలో తొలిసారి 1995 జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగగా.. అప్పటినుంచి వరుసగా అంటే 2001, 2006, 2021 ఎన్నికల్లో అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతూ వస్తుంది. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో నామినేషన్ కు కూడా ప్రత్యర్థులు ధైర్యం చేయలేకపోయారు. 2016లో తొలిసారి అక్కడ అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేసింది టీడీపీ. అందులో భాగంగా రమేష్ యాదవ్ ను బరిలోకి దించింది. నామినేషన్ల విత్ డ్రా తర్వాత టీడీపీకి హ్యాండిచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు రమేష్ యాదవ్. అయినా.. వదిలి పెట్టని టీడీపీ భారీ స్థాయిలో ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి 2750 ఓట్లు రాగా 2500 ఓట్ల మెజార్టీతో విజయం వైసీపీ అభ్యర్థి లింగమయ్య సాధించారు. 2021లో పులివెందుల జడ్పీటీసీగా వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే 2023, ఫిబ్రవరిలో శివరాత్రి సంబరాల్లో ఎడ్లబండిపై నుంచి పడి ఆయన మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ బరిలో దించింది.
తొలి నుంచి పక్కా ప్లాన్
అయితే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో తొలి నుంచి పక్కా ప్లాన్ చేసింది. ఏకంగా బీటెక్ రవి సతీమణిని లతారెడ్డిని బరిలోకి దిపింది. అభ్యర్థి ఎంపికలో రెండు వ్యూహాలు వ్యవహారించింది. ఒకటి: ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిని బరిలోకి దించడంతో వార్ వన్ సైడ్ అవుతుందని వ్యూహం కాగా రెండవది గతంలో చివరి నిమిషంలో అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న అనుభవాలతో.. ఈ సారి అలా జరగకుండా స్కెచ్ వేసింది. జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రచారంలోకి దించారు చంద్రబాబు. దీంతో వైసీపీ ఓటమికి కసితో పని చేశారు ఈ ఇద్దరు ఈ లీడర్లు.. క్షేత్ర స్థాయిలో బీటెక్ రవి కూడా సత్తా చాటారు.
వీరితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారథి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బైరెడ్డి శబరి ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ప్రచారం చేయించింది. పులివెందులలో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామంటూ.. పూర్తి సమన్వయంతో పని చేశారు నేతలు. ప్రతీ గ్రామంలో పర్యటించి వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలోకి చేరేలా వ్యూహాలు రచించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారానికి హామీలు ఇచ్చారు. మొదటగా ఎన్నికను పెద్దగా సీరియస్ గా తీసుకోని వైసీపీ, కంచుకోటలో తమ గెలుపును అధికార పార్టీ ఆపలేదని ధీమాలో నేతలున్నారు. చనిపోయిన జడ్పీటీసీ కొడుకుని పోటీకి దించడంతో సానుభూతి కలిసి వస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో టీడీపీ చొచ్చుకుపోయింది.
వైసీపీ తరఫున ప్రచారాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి భుజాన వేసుకోగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జగన్ మామ రవీంద్రనాద్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు మరింత ప్రచారం చేశారు. ఇదే సమయంలో వివేకానంద రెడ్డి 74వ జయంతి జరగగా.. పులివెందులలో కూతురుసునీత, వివేక భార్య సౌభాగ్యమ్మ నివాళులర్పిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. వివేక హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ముగ్గురు పేర్లు రాసుకుని వచ్చి సంతకం పెట్టాలని చెప్పినట్లు వెల్లడించారు. నాన్న వివేకానంద రెడ్డి పులివెందుల ప్రజల కోసం ఎంతో చేశారని, ఆయన గురించి వైఎస్సార్సీపీ నాయకులు ఒక్కరు కూడా గుర్తు చేసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన వివేక.. వైఎస్, జగన్ హయాంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ ఎఫెక్ట్ కూడా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.