BIG BREAKING: సుగాలి ప్రీతీ కేసుపై సంచలన అప్‌డేట్..

సుగాలి ప్రీతి కేసు ఏపీలో మరోసారి దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ప్రతీ మృతి కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

New Update
Sugali Preeti Case

Sugali Preeti Case

సుగాలి ప్రీతి కేసు ఏపీలో మరోసారి దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ప్రతీ మృతి కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆగస్టు 18న కర్నూల్‌లో ఆమె మృతి చెందింది. స్కూల్‌ హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించడం కలకలం రేపింది. వైసీపీ హయాంలో కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కానీ దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని గతంలో అప్పటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: అయ్యో.. ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి!

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది దాటింది. అయినప్పటికీ తమ కూతురు కేసు గురించి పట్టించుకోవడం ప్రీతి తల్లి వాపోయింది. దీంతో వీల్ చైర్ యాత్రకు ఆమె సిద్ధమైపోయింది. ఈ క్రమంలోనే ఈ కేసును కూటమి ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించింది. 

Advertisment
తాజా కథనాలు