Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల వెలికితీత పనులు సక్సెస్

ఏపీలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత పనులు సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు అధికారులు రెండు బోట్లను వెలికితీశారు. అయితే తాజాగా దాదాపు 40 టన్నుల బరువున్న మూడో బోటును కూడా విజయవంతంగా బయటకు తీశారు.

Stranded Boats
New Update

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడకు వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి ప్రకాశం బ్యారేజీని బోట్లు కూడా ఢీకొన్నాయి. గత కొన్ని రోజులుగా బోట్ల వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ పనులు సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు అధికారులు రెండు బోట్లను వెలికితీశారు. అయితే ఇప్పుడు తాజాగా దాదాపు 40 టన్నుల బరువున్న మూడో బోటును కూడా బయటకు తీశారు. వరదలకు మొత్తం 4 బోట్లు బ్యారేజీ వైపు కొట్టుకొచ్చాయి. అందులో ఓ బోటు వరద కిందకు కోట్టుకుపోయింది.  

Also Read: ఏ ఒక్కరినీ వదలి పెట్టం.. లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలనం!

దీంతో మరో మూడు బోట్లు మాత్రం బ్యారేజీ గేట్ల వద్దే చిక్కుకున్నాయి. దీంతో వాటిని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత రెండు వారాలుగా ఆ బోట్ల వెలికతీత పనులు సాగుతున్నాయి. ఇటీవలే రెండు బోట్లను బయటకు తీయగా.. ఇప్పుడు చివరికి మూడో బోటును కూడా అధికారులు విజయవంతంగా బయటకు తీశారు. 

#vijayawada #telugu-news #boats #prakasham-barrage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe