/rtv/media/media_files/2025/10/25/shivashankar-2025-10-25-09-52-10.jpg)
కర్నూలు బస్ ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బస్ ప్రమాదానికి కారణమైన బైకర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు.. ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లిన బైకర్ శివశంకర్.. పెట్రోల్ బంక్‌లో బైక్‌తో విన్యాసాలు చేశాడు. బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. బైక్‌ను ఢీ కొట్టడంతో వీకావేరి బస్సులో మంటలు చెలరేగాయి.
సీసీటీవీ ఫుటేజ్
— RTV (@RTVnewsnetwork) October 25, 2025
నిన్నటి బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
పెట్రోల్ బంకు నుంచి వెళ్తున్న విసుఅల్స్.#AndhraPradesh#kurnool#busfireaccident#biker#petrolbunk#RTVpic.twitter.com/rUfuUqHEqD
పెట్రోల్ బంక్ సీసీ పుటజ్ లో
ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాలకు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉండగా.. 2 గంటల 40 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. పెట్రోల్ బంక్ సీసీ పుటజ్ లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. మరోవైపు బస్సు నడిపింది డ్రైవర్ కాదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగినప్పుడు క్లీనర్ డ్రైవింగ్ చేసినట్లు సమాచారం. ఇక డ్రైవర్ చదివింది ఐదవ తరగతి అయినప్పటికీ తప్పుడు పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు.
కర్నూలు బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ మృతి..
— RTV (@RTVnewsnetwork) October 24, 2025
ఈ విషయం తెలియగానే బోరుమని ఏడుస్తున్న శివశంకర్ తల్లి.. #Kurnool#Bus#FireAccident#Bike#rider#Mother#RTVpic.twitter.com/mNEWvDEXc9
శివశంకర్ మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.తాను బతికి ఉండగానే కన్న బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల యశోద తలపట్టుకుని విలపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా శివశంకర్ గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవాడు. నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గా పోలీసులు నిర్ధారించారు.
Follow Us