AP Crime: ఉదయం పెళ్లి... రాత్రి సూసైడ్‌.. సత్యసాయి జిల్లాలో విషాదం

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని మణికంఠనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవవధువు హర్షిత (20) పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Sathya Sai Crime News

Sathya Sai Crime News

Sathya Sai Crime News: పెళ్లి అనేది అమ్మాయిల జీవితంలో ఒక కొత్త మలుపు. జీవితాంతం తోడుండే భర్త కోసం అమ్మాయిలు ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రుల విషయమైతే చెప్పనక్కర్లేదు. పెళ్లి గురించి వాళ్ళ ఆలోచనలు, ఆరాటాలు మాటల్లో చెప్పలేం. కన్న కూతురికి మంచి లైఫ్‌ ఇవ్వాలని, మంచి భర్తను వెతకాలని అనేక విధాలుగా ఆలోచిస్తారు. ఎంతో కష్టపడి వివాహం చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల ఆశలు కలలుగానే మిగిలి పోతున్నాయి. మరికొందరు అయితే పెళ్లి చేసుకుంటున్నారు గానీ జీవితాన్ని అనుభవించ లేకపోతున్నారు. కొందరూ ప్రేమ, ఇష్టం లేని పెళ్లి అంటూ వారికి నచ్చిన విధానాన్ని వెళ్తుకుంటున్నారు. తాజాగా ఓ నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే జీవితాన్ని ముగించుకున్న ఘటన ఏపీలో చోటుచేసుకుంది.  

కాళ్లపారాణి ఆరకముందే నవవధువు..

శ్రీ సత్యసాయి జిల్లా (Sathya Sai) సోమందేపల్లి మండలంలోని మణికంఠనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవవధువు హర్షిత (20) పెళ్లి జరిగిన రోజే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. కృష్ణమూర్తి-వరలక్ష్మి దంపతుల కుమార్తె అయిన హర్షితకు ఆగస్టు 4న ఉదయం కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే సాయంత్రం హర్షిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హర్షిత (Harshita) మృతదేహాన్ని వెంటనే పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 



ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్‌లోనే!

మృతికి గల కారణాలపై స్పష్టత లేకపోవడంతో.. కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నవవధువు మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంత ఆనందంగా జరిగిన పెళ్లి రోజునే ఇలాంటి విషాదం జరగడం దురదృష్టకరం అని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత.. పోలీసుల (police)దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి జరిగిన రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవవధువు మృతికి గల కారణాలు ఏంటి..? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!

( Latest News | telugu-news)

Advertisment
తాజా కథనాలు