ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటించిన దేవర సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉన్న పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చుట్టమల్లే, దావూదీ పాటలకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. అయితే దావుదీ పాటకు ఓ ఆర్టీసీ డ్రైవర్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియా వైరలయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
Also Read: ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి!
ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తునిలోని రౌతులపుడి దగ్గర్లో ఆర్టీసీ బస్సులో సమస్య తలెత్తింది. దీంతో అది రోడ్డుపైనే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా మళ్లీ స్టార్ట్ కాలేదు. అయితే ఆ బస్సు డ్రైవర్ అయిన లోవరాజు కిందకి దిగాడు. బస్సు ముందుకు వచ్చి దావుదీ పాటకు డ్యాన్స్ చేశాడు. దీంతో డ్రైవర్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ను ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరలయ్యింది. పలువురు నెటీజన్లు ప్రశంసిస్తూ విభిన్న రీతిలో కామెంట్స్ చేశారు. ఆఖరికి మంత్రి లోకేశ్ కూడా లోవరాజు డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ఎక్స్ వేదికగా ఆ డ్రైవర్‌ను అభినందించారు.
Tuni Bus stand Passengers :- Bus endhi inka ravatle ???
— Mahesh Goud #9999# (@indian66669296) October 25, 2024
Meanwhile Driver :- 👇🤣 pic.twitter.com/LlCAfYbyyn
Also Read: ఆంధ్రా వాసులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు విమాన సర్వీసులను ప్రారంభం
డ్రైవర్ ఆవేదన
అయితే లోవరాజు డ్యాన్స్ వీడియో ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ బస్సు ముందు అలా డాన్స్ వేయడంపై సీరియస్ అయ్యారు. దీంతో ఆ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగం నుంచి తొలగించడంపై డ్రైవర్ ఆవేదన చెందుతున్నారు. పదేళ్ల నుంచి లోవరాజు ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బస్సులో ఉన్న విద్యార్థుల కోరిక మేరకు బస్సు ముందే ఆయన డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్నతాధికారులు ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంపై కూడా సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
Follow Us