AP News: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బస్సు ఢీకొని ఐదుగురు మృతి ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నవారిని ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు. చిత్తూరు-కడప రహదారిపై కలకడ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. సంబేపల్లె మండలం రౌతుకుంటలో ఓ మహిళ మృతిచెందింది.
ఇందిరమ్మ కాలనీ సమీపంలో..
అంత్యక్రియల్లో పాల్గొనడానికి కలికిరి మండలం చండ్రావారిపల్లె పంచాయతీ దూదేకులపల్లెకి చెందిన బంధువులు ఆటోలో వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఫకీర్‌బీ (55), బుజ్జమ్మ (50), ఖాదర్‌వలీ (35), చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమందకు చెందిన ఆటో డ్రైవర్ నూరుల్లా మృతి చెందారు.
చికిత్స నిమిత్తం:
మరో వ్యక్తితో పాటు తల్లి, కుమార్తెలు తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కార్డియాక్ డిప్రెషన్ అంటే ఏంటి?
గత రెండు రోజుల కిత్రం ఎన్టీఆర్ జిల్లా గరికపాడు రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్ చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా.. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం మరువక ముందే.. అన్నమయ్య జిల్లాలో ప్రమాదం ఏపీ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఓ కార్యక్రమానికి వెళ్తుండగా..
ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ఉపవాస సమయంలో బంగాళాదుంప తింటే ఏమవుతుంది?
ఇది కూడా చదవండి: 46 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బ్యూటీ
ఇది కూడా చదవండి: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి?