AP: మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
దళితులను అవమానించారంటూ..
ఈ మేరకు 2023 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను పర్యాటక శాఖ మంత్రి హోదాలో రోజా సందర్శించారు. పర్యాటక శాఖ రిసార్ట్స్ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె సముద్రంలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచి వాటిని జాగ్రత్తగా చూడాలంటూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో స్థానిక పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్ ఉద్యోగి శివనాగరాజు రోజా చెప్పులను కొద్దిసేపు మోసి పక్కన పెట్టారు. ఆ తర్వాత బీచ్ నుంచి తిరిగొచ్చిన రోజా ఆ చెప్పులు వేసుకుని రిసార్ట్స్‌కు వెళ్లారు.
ఇది కూడా చదవండి: టీమిండియా క్రికెటర్ పై కన్నేసిన'బాలయ్య' హీరోయిన్..డేటింగ్ కి రెడీ అంటూ
అయితే అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నాగరాజు దళితుడు కావడంతో తమను అవమానించారంటూ ఆమెపై దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: వామ్మో ఆఫీసులో కునుకు తీశాడని.. ఇన్ని లక్షలు ఫైన్ హా?