Rains : వరుణా మళ్లీ వచ్చావా... బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.

author-image
By Bhavana
ap rains
New Update

Andhra Pradesh : 

భారీ వరదలు, వానల నుంచి ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ టైమ్‌ లో మరోసారి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. 

అయితే దీని ప్రభావం పశ్చిమబెంగాల్, బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ మీద అల్పపీడనం ప్రభావం అంతగా లేకపోయినా.. వచ్చే మూడు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (సెప్టెంబర్ 14) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శుక్రవారం కూడా పలు జిల్లాలలో వర్షం కురిసిందని పేర్కొంది.

మరోవైపు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ లోని కొన్ని జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. విజయవాడ (Vijayawada) సహా కొన్ని జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికీ కొన్ని ఊర్ల ప్రజలు వరదల నీటిలోనే నానుతున్నారు. వరదనీరు ఇళ్లల్లోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వాహనాలు దెబ్బతిన్నాయి.

ఇళ్లల్లోకి బురద నీరు చేరి.. పునరావాస కేంద్రాలకే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి వానలు కురుస్తాయన్న వార్తలు ఏపీవాసులను ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు భారీ వర్ష సూచన లేకపోవటంతో కాస్త కుదుట పడ్డారు.

మరోవైపు భారీ వర్షాలు (Heavy Rains), వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ (AP Government) రెడీ అవుతోంది. వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు అందించే సాయం గురించి మంత్రులు, అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.

Also Read : తోడేళ్ళతోనే చస్తుంటే..ఇప్పుడు చిరుతలు ఎంటర్
#heavy-rains #imd #andhra-pradesh-floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe