రౌడీషీటర్, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌పై గతంలో తూళ్లురు పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయింది. ఎంసీసీ ఉద్యోగులను కులం పేరుతో దూషించి, వారిని బెదించినట్లు కేసు ఫైల్ అయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మెల్లమెల్లగా పాత కేసులను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగానే గతంలో ఫైల్ అయిన కేసులో బోరుగడ్డ అనిల్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పెట్టారు.
Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?
ఈ మేరకు రిమాండ్‌లో ఉన్న అనిల్‌ను కోర్టులో హాజరు పరుస్తూ మళ్లీ సెంట్రల్ జైలుకు తీసుకువస్తున్నారు. అయితే గతంలో ఉద్యోగులను దూషించి, బెదిరించానని నేరం ఒప్పుకున్న అనిల్ కుమార్.. తాజా విచారణలో మాట మార్చాడు. తానెవరినీ కులం పేరుతో దూషించలేదని.. ఎవరినీ బెదించలేదని చెప్పాడు. అయితే గతంలో నేరం ఒప్పుకుని.. ఇప్పుడెందుకు అబద్ధం చెప్తున్నావ్ అని పోలీసులు అడగ్గా తనకేం గుర్తులేదన్నాడు.
Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా
నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించగా.. మంగళగిరి కోర్టు ఒకరోజు విచారణకు ఒకే చెప్పింది. ఇందులో భాగంగానే అనిల్ కుమార్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరిపారు. ఎంసీసీ బృందాలను బెదించడం వెనుకున్న ఉద్దేశమేంటి? అని పోలీసులు అడిగారు. అంతేకాకుండా మీ కారును తనిఖీ చేస్తే అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించారు.
Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
అందులో డబ్బు, మద్యం లేకపోతే తనిఖీలకు సహరించొచ్చు కదా? అని అడిగారు. అయినా ఉద్యోగులను కులం పేరుతో ఎందుకు దూషించారు?.. వారిని బెదిరించమని మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? అని పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. అంతా మర్చిపోయానని తెలిపాడు. తప్పు అయిపోయిందని.. ఇంకెప్పుడూ అలా చేయనని అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఏంటా కేసు?
Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్
గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో బోరుగడ్డ అనిల్ తన అనుచరులతో కలిసి అమరావతి వైపు కారులో వెళ్లాడు. అదే సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) బృందాలు తనిఖీలో భాగంగా వారి కారును ఆపాయి. దీంతో బోరుగడ్డ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కారును ఆపి తనిఖీ చేస్తారా? అంటూ రగిలిపోయాడు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని.. మీకెంత ధైర్యం ఉంటే తన కారుని ఆపుతారు అంటూ బెదిరించాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించిన బోరుగడ్డపై ఎంసీసీ బృంద సభ్యుడు, ఏఎస్సై ఫిర్యాదు మేరకు తూళ్లురు పోలీసులు కేసు ఫైల్ చేశారు.