/rtv/media/media_files/2025/09/16/a-game-of-poker-2025-09-16-10-02-23.jpg)
Poker Players in Penna River
Poker players : నెల్లూరులో పేకాటపై పోలీసుల నిఘా పెరగడంతో పేకాటరాయుళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. కానీ, ప్లాన్ బెడిచి కొట్టి ప్రాణాల మీదకు రావడంతో అదే పోలీసులకు తమను రక్షించాలంటూ వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలో ఎక్కడ పేకాట ఆడుతున్నా పోలీసులు దృష్టి పెట్టడంతో పట్టణానికి చెందిన 15 మంది యువకులు టీమ్‌గా ఏర్పడ్డారు. నగర పరిధిలోని భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన యువకులు పోలీసుల టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే నదిలోకి వెళ్లి పేకాట ఆడుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగా అందరూ సమీప పెన్నా నదిలోకి వెళ్లి బైపాస్ బ్రిడ్జి కింద లైట్లు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్న సమయంలో అధికారులు సోమశిల డ్యామ్ (Soamsila Dam) నుంచి నీటిని విడుదల చేయగా.. యువకులు ఆ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వెంటనే నీరు వారిని చుట్టిముట్టింది. ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. చుట్టూ నీరు ఏం చెయ్యాలో కాసేపు తర్జనభర్జన పడ్డారు. నదిలో ఉంటే చనిపోవడం గ్యారంటీ అని భావించి కేకలు వేయడం మొదలుపెట్టారు. వంతెన మీదుగా వెళ్తున్న స్థానికులు వారిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ ఎస్పీ, కలెక్టర్లను అలర్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: IRCTC: రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా ?.. త్వరలో మారనున్న రూల్స్
వెంటనే వారు అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు, -రెవెన్యూ అధికారులను అలెర్ట్ చేసి ఆ ప్రాంతానికి పంపించారు. అర్ధరాత్రి పోలీసుల రిస్క్ ఆపరేషన్ చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది బ్రిడ్జిపై నుంచి నదిలోకి నిచ్చెన వేసి కిందకు దిగారు. నదిలో వెలుతురూ రావడానికి ప్రత్యేకంగా ఆక్సా లైట్ ఏర్పాటు చేసిన నవాబుపేట పోలీసులు కిందకు దిగి రోప్స్ నిచ్చెనల సాయంతో దాదాపు 6 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ లో యువకులను నదిలోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నదిలో ఆటలు ఆడేందుకు వెళ్లిన యువకులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.