PM Modi: సత్యసాయి సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ సత్యసాయి నగరం చేరుకున్నారు. సత్యసాయి శతజయంతుత్సవాల్లో భాగంగా ఆయన సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఆయనతో పాటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.

New Update
modi

 ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కొంత సేపటి క్రితం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఆయన..సాయి కుల్వంత్ హాల్ లో సత్య సాయి మహా సమాధిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడి పూజారులు ప్రధాని మోదీని ఆశీర్వదించారు.  అనంతరం హిల్‌ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు. అక్కడ బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ శత జయంతి ఉత్సవాలకు మాసటర్ బ్లాస్టర్ సచిన్, నటి ఐశ్వర్యారాయ్ తదితరలు హాజరయ్యారు. 

Also Read: Chhattisgarh : ఐసిస్ తో సంబంధాలు..ఛత్తీస్ ఘడ్ లో ఇద్దరు మైనర్ కుర్రాళ్ళు అరెస్ట్

Advertisment
తాజా కథనాలు