Perni Nani : ఎవడొస్తాడో రండిరా..  దమ్ముంటే కొడాలి నానిని కడ్‌ డ్రాయర్‌పై నడిపించాలి :  పేర్ని నాని

కూటమి నేతలకు మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన సవాల్ చేశారు. ఎవడొస్తాడో రండి..  దమ్ముంటే కొడాలి నానిని కడ్‌ డ్రాయర్‌పై నడిపించండి చూద్దాం అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. నాని అంతు చూస్తామన్నవారు చేసి చూపించాలన్నారు.  

New Update
kodali-vs-perni

కూటమి నేతలకు మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన సవాల్ చేశారు. ఎవడొస్తాడో రండి..  దమ్ముంటే కొడాలి నానిని కడ్‌ డ్రాయర్‌పై నడిపించండి చూద్దాం అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇన్ని రోజులు అనారోగ్యంతో నాని గుడివాడలో యాక్టివ్‌గా లేరని ఇప్పుడు ఆరోగ్యం బాగు చేసుకొని మరో మూడు నెలల్లో గుడివాడలో అడుగుపెడుతున్నారని తెలిపారు. నాని అంతు చూస్తామన్నవారు చేసి చూపించాలన్నారు.  పెడనలో ఆదివారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని ఇలాంటి కామెంట్స్ చేశారు.  నువ్వు 70 ఏళ్ల ముసలోడివవి .. ఇంకెత కాలం బతుకుతావ్..  50 ఏళ్ల జగన్ ను భూస్థాపితం చేయడం నీ తరమా.. నీ కొడుకు తరమా అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు.

వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ

 ఇక వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడారని..  ఐదు నెలలు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు. తప్ప ఏం చేశావ్‌ అంటూ పేర్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ అయన్నపాత్రుడు 80 ఏళ్లు వచ్చినా చావలేదన్నారు.  మంత్రి కొల్లు రవీంద్ర కాదు.. సొల్లు రవీంద్ర అంటూ పరుష పదజాలాన్ని వాడారు. మంత్రి కృత్తివెన్నులో 45 ఎకరాలు ఆక్రమించాడన్న పేర్ని నాని  త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని సవాల్ చేశారు. ఇక చీకట్లో నరికేయండి అని తాను అనలేదన్న పేర్ని నాని..  తాను అనాలంటే పట్టపగలే చేసేయండని అనేవాడినని..  అలా అనడం తన  సంస్కారం కాదన్నారు.  పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  

Advertisment
Advertisment
తాజా కథనాలు