Pawan kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అధికారులకు నాయకులు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వమే మంచిదే కానీ.. మెతక ప్రభుత్వం కాదన్నారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. జగన్, ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: పాక్ ఎఫెక్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం!?
సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తాం..
ఈ మేరకు పవన్ మాట్లాడుతూ.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు కావాలంటే భద్రత కల్పిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గత నాయకులు ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ ఇష్టం వచ్చినట్లు చేశారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేశారు. జగన్ మాజీ సీఎం అయినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మీకు బాధ్యత ఉండాలి. సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం. ఈగ వాలినా మీదే బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా’ అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Cinema: పుష్ప-2 సెట్స్ నుంచి ఫొటోలు లీక్..అదిరిపోయిన అల్లు అర్జున్
ఇక అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు రూ.5కోట్ల విరాళం సేకరించి ఇస్తామని చెప్పారు. అటవీ శాఖకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. భవిష్యత్తులో అటవీ అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులర్పిద్దాం. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తాం. అమరుల స్మరణకు ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్‌లకు వారి పేర్లు పెట్టాలన్నారు పవన్.