Ap-Aghori: ఏపీకి మకాం మార్చిన అఘోరీ.. ఆ ప్రముఖ ఆలయంలో రహస్య పూజలు!

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరీ ప్రస్తుతం ఏపీలో ప్రత్యక్షమైంది. ఆత్మకూరులో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండ వెళ్లింది.

New Update

Ap-Aghori: గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయంలో పూజాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన అఘోరీ...ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షం అయ్యింది. ఆత్మకూరులో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. కొందరు స్థానికులు కారును వెంబడించి ఆపాలని అడిగారు.

అయినా సరే కారును ఆపకుండా శ్రీశైలం రహదారి మీదుగా వెళ్లిపోయింది. దీంతో స్థానికులు నిరాశతో వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం జరగగా.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ గుడిలో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని, ఆమె ఇంటికి తరలించారు. అక్కడి నుంచి ఆమె మహారాష్ట్ర వెళ్లినట్టు తెలిసింది.

అఘోరీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇకపై మళ్లీ తెలంగాణకు రానని అఘోరీ తెలిపింది. ప్రస్తుతం ఆమె కాశీకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే చెప్పిన మాట ప్రకారం మళ్లీ తిరిగి రాకుండా ఉంటుందా? లేక మరేదైన కారణంతో తెలంగాణ బాట పడుతుందా? అని కొందరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా గత నెల రోజులుగా అఘోరీ తెలంగాణలో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

ముఖ్యంగా తెలంగాణలో అడుగుపెట్టిన లేడీ అఘోరీ మొదట కొన్ని ఆలయాలను సందర్శించింది. కానీ అంతలా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో నగ్నంగా పూజలు చేయడంతో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంకాస్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఆ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలకు నెటిజన్లు షాక్ అయ్యారు. శవాలను తింటామని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ఆమెకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అయింది. ఆ తర్వాత సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే తాను ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. 

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

అందులో తాను చనిపోతే శివయ్య వద్దకు వెళ్లిపోతానని.. బతికుంటే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఇక ఆమె ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

ఈ మేరకు హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సిద్ధిపేటలో అఘోరీని అదుపులోకి తీసుకుని తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడ తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అక్కడ రెండు రోజుల పాటు అఘోరీని హౌస్ అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు ఆపై రీసెంట్‌గా మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. ఇక అక్కడ నుంచి అఘోరీ కాశీకి వెళ్లిపోయింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు