ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపుల ఫోన్ కాల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పవన్‌ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అగంతకుడిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బీపేటలో ఉన్నట్లు సెల్‌ఫోన్ ట్రాక్ చేసి పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్బీపేటకు వెళ్లే సరికి ఆ అగంతకుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.
నాగబాబు సంచలన ట్వీట్
పవన్‌కు బెదిరింపుల వేళ మెగా బ్రదర్ నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని.. పవన్‌తో స్నేహం చేయడం, అతనితో జట్టు కట్టడం, అతనికి సన్నిహితుడిగా ఉండడం, కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని...
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 9, 2024
అతనితో స్నేహం చేయడం,
అతనితో జట్టు కట్టడం,
అతనికి సన్నిహితుడిగా ఉండడం,
కానీ
అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి... pic.twitter.com/xQKPbQT2mv
Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!
పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పవన్‌ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!
దీంతో ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ కళ్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
హోంశాఖ మంత్రి అనిత రియాక్ట్
అదే సమయంలో పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమల రావు మంత్రి అనితకు వివరించారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత.. పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంపై ఆరా తీశారు.
Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!
ఇందులో భాగంగానే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వివరాలను డీజీపీకి అడిగి తెలుసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకోవాలని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. వీటి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.