Pastor Praveen Death: రాజమండ్రిలో హైటెన్షన్.. రోడ్డెక్కిన వేలాదిమంది పాస్టర్లు- VIDEO

రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది పాస్టర్లు, క్రైస్తవులు రోడ్డెక్కారు. ప్రవీణ్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ హైటెన్షన్ వాతావరణం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

New Update

రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది పాస్టర్లు, క్రైస్తవులు రోడ్డెక్కారు. ప్రవీణ్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో ప్రవీణ్ మృతదేహం అనుమానస్పద స్థితిలో కనిపించడం అనేక అనుమానాలకు దారి తీసింది. ప్రవీణ్‌ను హత్య చేశారంటూ కుటుంబసభ్యులు, పాస్టర్లు ఆందోళన చేస్తున్నారు. ముఖం, పెదాలపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.

పాస్టర్ పగడాల ప్రవీణ్‌ హత్యపై హోంమంత్రి అనిత సంచలన ప్రకటన చేశారు. మేము దీనికి యాక్సిడెంట్‌గా పరిగణించట్లేదన్నారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజీలు సేకరిస్తున్నామన్నారు. ప్రవీణ్ మరణం చాలా బాధాకరమన్నారు. దీనికి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టామన్నారు. ఎస్పీతో మాట్లాడానని.. సీఎం తనతో మాట్లాడారన్నారు. అత్యంత పారదర్శకంగా విచారణ కొనసాగిస్తున్నామన్నారు. క్రైస్తవ సంఘాల డిమాండ్ మేరకు అన్ని కోణాల్లో విచారిస్తామన్నారు. 

అన్ని కోణాల్లో విచారణ..

మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతికి గత కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కు ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా? అన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆయన ప్రయాణించి దారిలో సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

(Pastor Praveen | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
తాజా కథనాలు