Road Accident : ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేశినేనిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, లారీ బలంగా ఢీకొన్నాయి. వివరాలు ప్రకారం.. ముందుగా ఆర్టీసీ బస్సును లారీ బలంగా ఢీకొట్టగా.. అదే లారీని మరో లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు క్లీనర్లు, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే లారీ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ
ఇటీవలే కర్ణాటకలో
ఇది ఇలా ఉంటే ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు హైదరాబాద్ వాసులు అక్కడిక్కడే మృతి చెందారు. బొలేరో వాహనం కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే కర్ణాటకలోని వివిధ ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. కారులో గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read : పోసానికి బిగ్ షాక్.. సీఐడీ కేసు నమోదు
యూసఫ్‌గూడకు చెందిన భార్గవ కృష్ణ, ఆయన భార్య సంగీత, కొడుకు ఉత్తమ్ రాఘవ, కారు డ్రైవర్ రాఘవేంద్రగౌడ్ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తున్నారు. డబుల్ రోడ్డు అయినా మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అటువైపు నుంచి వేగంగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాద ఘటనలో భార్గవ కృష్ణ కుటుంబంతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
Also Read: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన
Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!