Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్ సినిమా.. రెండుగా చీలిన జనసేన!

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు చిత్రం భారీ అంచనాతో జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూవీ రిలీజ్ సందర్భంగా ఒంగోలులోని జనసేనలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్దాయి.

New Update
janasena

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు చిత్రం భారీ అంచనాతో జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూవీ రిలీజ్ సందర్భంగా ఒంగోలులోని జనసేనలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్దాయి. సినిమా ఫ్లెక్సీలు విషయంలో జనసేన రెండుగా చీలింది.  మొదటినుండి రియాజ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గాలు రెండుగా ఉన్నాయి. పవన్ సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సినిమా బెనిఫిట్ షో సందర్భంగా విడివిడిగా బైక్ ర్యాలీలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

సినిమా ప్రదర్శన థియేటర్లు దగ్గర నుండి, చూసే స్క్రీన్ వరకు జనసేన రెండుగా చీలింది.  ఏకంగా ఎవరికి వారు థియేటర్లు తీసుకొని అభిమానులకు సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన ఫ్లెక్సీలు తొలగింపు నేపథ్యంలో జరగనున్న కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొంది.  సినిమా విడుదల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తరువాత విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలున్నాయి.  ఈ హరిహర వీరమల్లు మంచి ఘనవిజయం సాధించాలని  ఆశిస్తున్నానని మాజీమంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. 

Advertisment
తాజా కథనాలు