అది జల యజ్ఞం కాదు ధనయజ్ఞం.. జగన్ కు మంత్రి ఘాటు కౌంటర్!

జగన్ కు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. జల యజ్ఞం పేరిట వైఎస్ కుటుంబం ధనయజ్ఞం చేసిందని ఆరోపించారు. 

New Update
sd dd

AP News: ఏపీ మాజీ సీఎం జగన్ కు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని  మోసం చేసి జగన్ పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఈ మేరకు ‘ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి  దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్ కు అర్థం అయిపోయింది. అందుచేతనే డైవర్షన్ పోలిటిక్స్ కు తెరలేపాడు. పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు, అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం  చేస్తున్నాడు. దానికి నేను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించానని చెప్పారు.  

జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం..

జగన్ బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణ మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశాడు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారు. ఇసుక మాఫియాతో  అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోగొట్టాడు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో..

పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టాడు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు పేజ్ లుగా విభజించింది జగన్ కాదా.. కేంద్రాన్ని 41.15 మీటర్లకు తగ్గించి అనుమతి కోరింది జగన్ కాదా.. మా ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల  ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవింపచేస్తాం. ఇప్పటికైనా అబద్ధాలు మాని నీ కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో.. ఇది నీ హితువు కోరి చెబుతున్నా’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 

ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు