Nellore: నెల్లూరు జిల్లాలో తారాస్థాయికి చేరిన వైసీపీ వర్గ పోరు.!
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ వర్గపోరు వ్యక్తిగతదాడుల వరకు దారితీసింది. వైసిపి కేడర్ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వ్యతిరేకవర్గమైన రాకేష్ రెడ్డిపై సత్యనారాయణ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డంతో నేరుగా వైసీపీ అధిష్టానం కల్పించుకుని సద్దుమనిగేలా చర్యలు తీసుకుంది.