Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్ జైలుకు తరలింపు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు.