Nellore: కుల,మత భేదం లేదు.. ఏ పండుగైన ఊరంతా ఒకే వంట!

పండుగ ఏదైనా సరే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగులపాడు గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు కుల,మత భేదాలు లేకుండా ప్రతి పండుగను ఒకేచోట కలిసి జరుపుకుంటారు. సర్వమత సమ్మేళనంగా ఒకే చోట వంట చేసుకొని భోజనాలు చేసి సంబరాలు చేసుకుంటారు.

New Update
nellore

Nellore Nagulapadu village festival

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో నాగులపాడు గ్రామం సర్వమత సమ్మేళనంగా ఉంటుంది. ఈ గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు ఎంతో సఖ్యతగా ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి ఉండడం విశేషం. ఏ పండగ అయినా గ్రామస్తులకు తమ పండుగగానే జరుపుకుంటారు. గ్రామంలో 150 కుటుంబాలు ఉండగా అందులో ముస్లిం కుటుంబాలు 50 ఉన్నాయి. వీటిలో 20 కుటుంబాలు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో వివిధ పనులకు వలసలు వెళ్లిపోయారు. అలాగే హిందువులు కూడా కొందరు ఇతర గ్రామాల్లో నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో పండుగ జరిగితే ఎవరు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా రావాల్సిందే.

హిందూ-ముస్లిం భాయ్ భాయ్..

సంక్రాంతి పండుగకు ముస్లిం సోదరులు రంజాన్ మొహరం పండుగకు హిందువులు ఈ గ్రామానికి వచ్చి అందరూ ఈ పండుగ తమ పండగలుగానే జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కూడా పలువురు ముస్లిం సోదరులు పండుగకు రెండు రోజులు ముందే గ్రామానికి చేరుకొని భోగి సంక్రాంతి కనుమ పండుగలను హిందూ సోదరులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఇలా పండుగలు జరుపుకోవడమే కాకుండా హిందువులతో కలిసి సాంప్రదాయక వస్తదారాలతో ఉండటం ఇక్కడ విశేషం.

ఇది కూడా చదవండి: Job Callender: నిరుద్యోగులను గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల!

ఇదే విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ తాము మామయ్య, బావ అంటూ పిలుచుకుంటామని మాకు ఉన్న సన్నిహితం ఇతర గ్రామస్తులకు కూడా కంటివిప్పుగా ఉంటుందని తెలిపారు. కనుమ పండుగ రోజు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని సంతోషంగా మాట్లాడుకొని ముస్లిం, హిందువులు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే అందరూ ఒకే చోట వంటలు చేసుకొని సహబంతి భోజనంగా సంతోషంగా కూర్చొని విందును ఆరగించారు. 

ఇది కూడా చదవండి: కుంభమేళలో ఈ బ్యూటీ సాధ్వి కాదు.. ఎవరీ హర్ష రిచారియా..?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు