Prakasham : మొంతా తుఫాను బీభత్సం ... టన్నెల్‌లో చిక్కుకున్న 100 మందికిపైగా కూలీలు!

ప్రకాశం జిల్లాలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది, దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వెలిగొండ టన్నెల్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో..   టన్నెల్‌లో 100 మందికిపైగా కూలీలు చిక్కుకున్నారు.

New Update
prakasham

ప్రకాశం జిల్లాలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది, దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వెలిగొండ టన్నెల్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో..   టన్నెల్‌లో 100 మందికిపైగా కూలీలు చిక్కుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు వెలిగొండ ప్రాజెక్ట్ కట్టకు గండి పడింది.  టన్నెల్‌లో లీకేజీ వాటర్‌ బయటకు పంపే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లీకేజీ వాటర్‌కు వరద నీరు మరింత తోడైంది. పూర్తిగా నీటితో టన్నెల్‌ - 2 నిండిపోయింది. దీంతో లోపల పని చేస్తున్న వారి పరిస్థితిపై గందరగోళం నెలకొంది. 

చెట్టుపై ఎక్కి సురక్షితంగా

మరోవైపు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన నూతలపాటి కోటయ్య అనే యువకుడు వరదలో చిక్కుకుపోయాడు.  మంగళవారం సాయంత్రం బైక్ పై కందుకూరు నుండి పొన్నలూరు మండలం ఉప్పలదిన్నె రోడ్డు ద్వారా రావులకొల్లు మీదుగా పచ్చ వెళుతూ పొన్నలూరు ఉప్పలదిన్నె మధ్యలో నేల సపట ఉధృతంగా ప్రవహిస్తుంది. అందులో నుంచి  దాటడానికి ప్రయత్నిస్తూ నీటిలో బైక్ కొట్టుకుపోయింది. ఆ యువకుడు మాత్రం వెంటనే  ఓ చెట్టుపై ఎక్కి సురక్షితంగా కూర్చున్నాడు.రాత్రంతా అక్కడే పోయాడు. తెల్లవారుజామున గమనించిన గ్రామస్తులు బుధవారం రోజున ఎట్టకేళకు అతన్ని సురక్షితంగా రక్షించారు. 

ఇక ఏపీలో  మొంతా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వేలాది చెట్లు, వందలాది స్తంభాలు కూలిపోయాయి. కృష్ణా జిల్లాలో అరటి, బొప్పాయి తోటలు నేల కూలాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పత్తిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. 

Advertisment
తాజా కథనాలు