CYCLONE Montha:  బీభత్సం సృష్టిస్తోన్న ‘మొంథా’.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంది.  కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్‌ బలహీనపడనుంది. అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతుంది.

New Update
Monsoon Impact

Monsoon Impact

CYCLONE Montha : రెండు తెలుగు రాష్ర్టాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంది.  కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్‌ బలహీనపడనుంది. అర్ధరాత్రి 11:30 - 12:30 నిమిషాల మధ్య తీరం దాటిని తుఫాన్ కోస్తా జిల్లాలపై విరుచుకుపడుతుంది. నరసాపూర్ సమీపంలో తీరం దాటిన తుఫాన్‌ మూలంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో ఏపీలోని 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖ, విజయనగరం...అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అల్లూరి, NTR, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు... నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.కాకినాడ, ఉభయగోదావరి, ప్రకాశం, కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణఝ శాఖ తెలిపింది.

రేపు పాఠశాలలు, కాలేజీలకు సెలవు

మొంథా తుపాన్‌ ప్రభావం కోనసీమ ప్రాంతంపై తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోవడంతో కోనసీమ తీరప్రాంతం అంధకారం నిండింది.తుపాన్‌ మూలంగా ఏపీలోని 19 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖపట్నం..కోనసీమ, కాకినాడ, తూ.గోదావరి, ప. గోదావరి, ఏలూరు..కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల..పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా..ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కాలేజీలకు కూడా రేపు సెలవులు ప్రకటించారు. మరోవైపు కాకినాడలో అక్టోబర్ 31 వరకూ సెలవులు ప్రకటించారు.

ప్రకాశం జిల్లాలో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు చెరువులకు గండి పడడంతో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఒల్లూరు చెరువుకు గండి పడటంతో వరదనీరు NH-16 నుంచి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో శ్రీశైలంలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. శ్రీశైలంలోని పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు  చేరింది.శ్రీశైలం డ్యాం దగ్గర కొంగ చరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. లింగాల గట్టులో మత్య్సకారుల ఇళ్లు నీట మునిగాయి. దీంతో మత్స్య కారులు అర్ధరాత్రి నుంచి బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
 
తెలంగాణపై మొంథా తుఫాన్ పంజా

మొంథా తుపాన్‌ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది.రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లు చెరువుల్లా మారాయి. వాతావరణ శాఖ తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, 9 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్‌కర్నూలు జిల్లాల్లోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్.. మంచిర్యాల, నల్గొండ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ సూచించింది.

Advertisment
తాజా కథనాలు