Srikakulam: శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ఇదే..!
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Dharmana: పీకే బ్రోకర్.. సచివాలయం తాకట్టు పెడితే మీకేంటి? : ధర్మాన కృష్ణదాస్
ప్రశాంత్ కిశోర్ టీడీపీకి బ్రోకర్ గా పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఈ క్రమంలోనే రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెడితే ప్రతిపక్షాలకు ఎందుకు తలనొప్పి అంటూ ప్రశ్నించారు.
జగన్ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన.!
'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి ధర్మాన. సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త విధానాలతో పాటు వైసీపీ పాలనను వివరిస్తూ రచయిత వేణుగోపాల్ రెడ్డి పుస్తకంను రచించారు.
AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్
మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు
/rtv/media/media_files/2025/12/27/fotojet-18-2025-12-27-15-20-43.jpg)
/rtv/media/media_library/vi/89_fJtkFiWc/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/darmana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dharmana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet5-1-jpg.webp)