ఆ ఐదుగురిపై కఠిన చర్యలు తీసుకోండి.. సీఎం చంద్రబాబుకు రఘురామ ఫిర్యాదు!

తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సీఐడీ విజయపాల్, డాక్టర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

New Update
fgtdrtegtdt4

RRR :తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ సీఎం జగన్, పీవీ సునీల్ కుమార్ IPS, సీతారామాంజనేయులు ఐపీఎస్, సిఐడి అధికారి విజయపాల్, డాక్టర్ ప్రభావతి (గుంటూరు జిజిహెచ్)తోపాటు ఇతరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 

బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ..

ఈ మేరకు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనపై జరిగిన కస్టడీయల్ హింసపై, చర్య తీసుకోవాల్సిందిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు రఘురామ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సీఐడీ అధికారి విజయపాల్ కు ముందస్తు బెయిలు నిరాకరించడం, పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ దర్యాప్తులో జోక్యం చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నందున ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

Also Read :  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హసన్ నస్రల్లా మృతదేహం లభ్యం

Advertisment