Breaking News : ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్!

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ  ఐదు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మార్చి 20న పోలింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.

New Update
Election Commission

Election Commission

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ  ఐదు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ.  మార్చి 3న నోటిఫికేషన్ రిలీజ్ చేసి 20వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్య పరంగా చూస్తే ఈ ఐదు స్థానాలు కూటమి  ప్రభుత్వానికి దక్కుతాయి. 

Also read :  Delhi: సీఎం రేఖా గుప్తా జీతం, అరవింద్ కేజ్రీవాల్ పెన్షన్ ఎంతో తెలుసా ?

నాగబాబుకు మంత్రి పదవి!

ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని టీడీపీ ప్రకటించింది. అయినను కేబినేట్ లోకి తీసుకుని మంత్రిని చేసే అవకాశం ఉంది.  ప్రస్తుతం కేబినేట్ లో ఒక పోస్టు కూడా ఖాళీగానే ఉంది.  ఇక మరో ఎమ్మెల్సీ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. మిగితా మూడు ఎవరికి దక్కుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, జంగా కృష్ణమూర్తి, రామారావుల ఎమ్మెల్సీ పదవీకాలం 2025 మార్చి 29తో ముగియనుంది.  

Also Read :  ఆ పార్టీకి గతమే.. ఇక భవిష్యత్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమైన తేదీలు  

1.మార్చి 03, 2025  నోటిఫికేషన్ జారీ - 

2. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ - 10 మార్చి, 2025 

3.మార్చి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన

4. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 13 

5 మార్చి 20వ తేదీన .పోలింగ్ తేదీ - 

6.పోలింగ్ సమయం - 09:00 am to- 04:00 pm

7. మార్చి, 20వ తేదీ సాయంత్రం 05:00 గంటలకు ఓట్ల లెక్కింపు-  

Also Read :  సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు