TTD: శ్రీవారిమెట్టు దగ్గర చిరుత సంచారం.. భక్తుల్లో టెన్షన్

తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.  శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

New Update

Leopard in Tirumala: తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.  శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచరిస్తుండగా కుక్కలు వెంబడించాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ భయంతో కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. ఉదయం టీటీడీ అటవీ అధికారులకు దీపక్ సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు మెట్టు దగ్గర అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో భక్తులకు భద్రత పెంచారు. చిరుత సంచరిస్తున్న ఘటన రాత్రి  సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

చిరుత ఎలా వచ్చిందనే కోణంలో ఆరా..?

ఆ సమయంలో భక్తులెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నడక మార్గంలో దర్శనానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచరించిన ప్రదేశాల్లో అటవీ శాఖ సిబ్బంది తనిఖీ చేసి ఏ ప్రాంతం నుంచి చిరుత వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు.  శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయితే చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం!

#ap-news #ttd #leopard-in-tirumala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe