Eluru: చిరుత సంచారం ఏలూరు జిల్లా వాసులను భయపెడుతోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో చిరుత సంచరిస్తోందనే వార్తలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల కిందట ఎం. నాగులపల్లి శివార్లలో చిరుత కనిపించింది. దీంతో అప్పటి నుంచి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
Also Read: మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం.. పలాసలో..
ట్రాప్ కెమెరాలను...
చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఈ ట్రాప్ కెమెరాలను పరిశీలించారు అటవీశాఖ అధికారులు.. ఆ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను సేకరించి రాజమహేంద్రవరం ల్యాబ్‌కు పంపారు.
Also Read: ప్రాణం తీస్తున్న జంతువులు.. తెలంగాణలో విషాద ఘటనలు
చిరుత సంచారం నిర్ధారణ కావటంతో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు ఆ ప్రాంతంలో బోను కూడా పెట్టారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!
శనివారం రాత్రి భీమడోలు జంక్షన్ - నాగులపల్లి మార్గంలో చిరుత సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి భీమడోలు మండలం పోలసానిపల్లి, అర్జావారిగూడెం, అంబరుపేట, ద్వారకా తిరుమల మండలం ఎం. నాగులపల్లి పరిసరాల్లో చిరుత కదలికలపై అటవీశాఖ అధికారులు దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ఈ కెమెరాల్లో చిరుత కనిపించడం స్థానికులను మరింత భయపెడుతోంది.
Also Read: మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?