గత రెండు వారాల పాటు తెలంగాణా అంతటా అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి వెళ్లిపోయిన అఘోరీ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో దర్శనమిచ్చింది.
Also Read: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం
టోల్ ప్లాజా వద్ద హల్ చల్
ఊహించని విధంగా సోమవారం సాయంత్రం విశాఖ దగ్గరలో నక్కపల్లి మండలంలో హల్చల్ చేసింది. సోమవారం సాయంత్రం తన కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వస్తూ వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైంది. దీంతో ఆత్రంగా స్థానికులు, టోల్ ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి, తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది.
Also read: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ
అతనెవరో తనకు తెలియాలని, సీసీ కెమెరా పుటేజీ కావాలని డిమాండ్ చేసింది. కాగా తాను టోల్ ఫీజు కోసమని కారు ఆపితే.. ఆమె కిందకు దిగిందని టోల్ ప్లాజా వద్ద వున్న ఒక వ్యక్తి చెప్పాడు. ఈ సమయంలో తాను చేతిని అడ్డంగా పెడితే ఆమె కింద నుంచి వెళ్లే క్రమంలో చేయి తగిలి వుండవచ్చునని.. ఉద్దేశపూర్వకంగా తాను తప్పు చేయలేదని చెప్పారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, సిబ్బంది ఆమెతో మాట్లాడారు.
Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!
ఒక వేళ తన తప్పయితే క్షమించాలని అతను కోరాడు. ఈ సందర్భంగా లేడీ అఘోరీ మాట్లాడుతూ ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని, నిత్యం శివ సాన్నిధ్యంలో వుండే తనపై అసభ్యంగా ప్రవర్తిస్తే, మహిళలకు రక్షణ ఎక్కడ వుంటుందని ఆమె ప్రశ్నించారు.
Also Read: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!
తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కృషి చేస్తున్నానని పునరుద్ఘాటించింది. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనని, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని చెప్పింది. తనలాంటి నాగ సాదువులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. సీఐ, ఎస్ఐలు నచ్చజెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.