/rtv/media/media_files/2025/10/03/hy26kurnool-banni-1-2025-10-03-06-41-26.jpeg)
దేవతామూర్తులను రక్షించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు.. 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడ్డారు. ఈ కట్టెల యుద్ధం కొన్ని ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఈ సమరాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవరగట్టుకు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దసరా పండుగ వచ్చిందంటే చాలు దేవరగట్టు కర్రల సమరం గుర్తుకు వస్తుంది.. సుమారు 2లక్షల మంది కలిసిన చోట కర్రలతో కొట్టుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతున్న స్టంట్... #Devaragattu#kurnool#KantaraChapter1#Andrapradeshpic.twitter.com/CqDhyfs0Gm
— 𝕸𝖞 𝖁𝖎𝖘𝖔𝖓 (@SbnSodanap65364) October 3, 2025
దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు జిల్లాలో రక్తసిక్తమైన దేవరగట్టు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 3, 2025
ఇద్దరు మృతి, 150 మందికి తీవ్ర గాయాలు
ఆలూరు, ఆదోని ఆసుపత్రులకు క్షతగాత్రులు.. నలుగురికి సీరియస్
గాలిలోకి ఎగిరిన పట్టుడు కర్రలు.. పుచ్చ కాయలా పగిలిన తలలు
అంచనాలకు మించి వచ్చిన ప్రజలు.. అల్లరి మూకల వికృత చేష్టలు
బన్నీలో ఇష్టానుసారంగా… pic.twitter.com/tmqSLDN7Hd
దేవరగట్టు కొండపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి (శివుడు), మాళమ్మ (పార్వతి దేవి)ల వార్షిక కల్యాణం అనంతరం ఈ ఉత్సవం మొదలవుతుంది. అర్ధరాత్రి జరిగే ఈ బన్నీ ఉత్సవాన్ని 'కర్రల సమరం' అని పిలుస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, హోళగుంద మండలం దేవరగట్టులో ప్రతి ఏటా విజయదశమి పండుగ సందర్భంగా జరిగే 'బన్నీ ఉత్సవం' దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా జరిగే 'కర్రల సమరం' ఒక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, ప్రతి సంవత్సరం ఇరువర్గాల మధ్య జరిగే హింసాత్మక ఘర్షణల వల్ల అనేకమంది గాయాలపాలవడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
చరిత్ర, నమ్మకం
ఈ 'కర్రల సమరం' వెనుక ఒక పురాణ కథ ఉంది. మాళ మల్లేశ్వర స్వామి, రాక్షసులు అయిన మని, మల్లాసురులు అనే వారిని సంహరించిన తర్వాత, వారికి నరబలి ఇవ్వాల్సి వస్తుంది. అయితే స్వామి అందుకు నిరాకరించగా, ఐదు చుక్కల రక్తం తమకు కావాలని రాక్షసులు కోరతారు. నాటి నుండి ఈ సంప్రదాయంలో రక్తం చిందడం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు నమ్ముతారు. రాక్షసులను సంహరించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లాలని భక్తులు పోటీపడటంతో ఈ హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి.
హింసను అరికట్టడానికి పోలీసులు డ్రోన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మద్యాన్ని నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ, భక్తులు తమ సంప్రదాయాన్ని విడిచిపెట్టడానికి నిరాకరిస్తున్నారు.