Joy Jemima : మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌ పై మరో కేసు నమోదు

హనీ ట్రాప్ నిందితురాలు జాయ్ జమీమా కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని తాజాగా విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులకు మరో బాధితుడు కంప్లైంట్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ పేర్కొన్నాడు.

honey trap case Joy Jemima
New Update

ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్న పేరు జాయ్ జమీమా. యువకులే టార్గెట్ గా చేసుకుని వారితో స్నేహం చేసి.. ఆపై దానిని ప్రేమగా మలుచుకుంటుంది. అనంతరం శారీరకంగా దగ్గరై ఫోటోలు, వీడియోలతో తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతుంది. అయితే ఇదంతా ఓ పెద్ద గ్యాంగ్‌తో ఆమె దందాను రన్ చేస్తుందా? లేక ఓ పెద్ద గ్యాంగే ఆమెను రిక్రూట్ చేసుకొని దందా చేస్తున్నారా? అనేది సస్పెన్స్ లో ఉంది. ఏది ఏమైనప్పటికీ హాట్ హాట్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తుందీ అందాల కిలాడీ లేడీ జాయ్ జెమీయా. ఆ తర్వాత వారి వీక్‌నేస్‌లను క్యాచ్ చేసి.. క్యాష్‌ చేసుకుంటోంది. అయితే ఇలా ఒక్కరు ఇద్దరు కాదు.. ఆమె లైనప్ లో చాలా మందే బాధితులు ఉన్నారు. అందులో ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాయ్ జెమీయా అసలు రంగు బయటపడింది. తర్వాత ఆమె గురించి తవ్వుతున్న కొద్ది అసలు బాగోతాలు బయటికి వచ్చాయి. ఆమె చేతిలో మోసపోయిన బాధితుల నుంచి కొన్ని కోట్ల రూపాయల చెల్లింపులను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె అకౌంట్స్‌ను ఫ్రీజ్‌ చేశారు. ఆమె బాగోతాలు తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ గురించి వినడమే కానీ.. ఇలా ఉంటారా? అంటూ కొందరు యువకులు ఆశ్చర్యపోతున్నారు. 

Also Read :  పవన్‌ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్.. కీలక బాధ్యతలు..!

అయితే జాయ్ జెమీయా పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తుంది. మొదటిగా యువకులను టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత వారితో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం ముచ్చట్లు పెట్టడం.. మెల్లి మెల్లిగా ముగ్గులోకి దింపడం వంటివి చేస్తుంది. ఇక చివరికి వారితో శారీరకంగా రిలేషన్‌షిప్‌లోకి తీసుకువెలుతుంది. అక్కడే అసలు ప్లాన్ మొదలెడుతుంది. వారితో దిగిన ఫొటోలు, వీడియోలను షూట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం చేస్తుంది. ఇలా ఆమె ట్రాప్ లో పడి కోట్ల డబ్బును కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది బయటకొచ్చి తమ గోడును విలపించుకుంటున్నారు. ఇంకా బయటికి రాని వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ కిలాడీ లేడీ బారిన పడి చాలా మంది యువకులు తమ పర్స్‌ను ఖాళీ చేసుకున్నారు అనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు. 

ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.. అయితే తాజాగా జాయ్ జమీమా కేసులో మరికొన్ని నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. బాధితులంతా ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరో బాధితుడు విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులకు జాయ్ జెమీయాపై కంప్లైంట్ చేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఆ బాధితుడు ఉద్యోగం కోసం విశాఖపట్నం వచ్చాడు. అక్కడే జమీనాతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అతను కంపెనీలో జాబ్ చేస్తుండగా.. కంపెనీ యజమాని తనను ప్రాజెక్టు హెడ్‌గా నియమించారని బాధితులకు జాయ్ జమీమా చెప్పింది. దీంతో వర్క్ విషయంలో జాయ్ జెమీయా ప్రతిరోజూ కలుస్తూ పరిచయం పెంచుకుని ఆ పరిచయం కాస్త.. స్నేహంగా మార్చిందని బాధితుడు చెబుతున్నాడు.

Also Read :  జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!

మత్తు స్ప్రే చల్లి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి..

అలా స్నేహం కాస్త మరికాస్త ముందుకు వెళ్లిందని చెప్పాడు. అయితే ఓ రోజు జాయ్ జెమీయా తనపై మత్తు మందు స్ప్రే చేసిందని.. ఆపై ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆ ఫోటోలు, వీడియోలు బయటికి రాకుండా ఉండాలంటే తనకు అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ జాయ్ జమీమా భయపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బులు డిమాండ్ చేసిన ప్రతిసారీ జాయ్ జమీమాకు డబ్బులిస్తూనే వచ్చాడట బాధితుడు. మూడు కోట్లు ఇస్తే శాశ్వతంగా వదిలేస్తానంటూ బాధితుడిని బెదిరించటంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి విశాఖలో ఉన్న తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని హైదరాబాదు వెళ్లిపోవడానికి ప్రయత్నం చేశాడు.

Also Read :  వివేక్‌ vs వినోద్‌.. మంత్రి పదవి కోసం అన్నదమ్ముల ఫైట్‌..

సమాచారం తెలుసుకున్న జాయ్ జమీమా.. మధ్యదారిలో అతన్ని అడ్డగించింది. తన దగ్గర ఉన్న డబ్బు, వస్తువులు, లాప్‌ట్యాప్‌..తీసుకుని వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విశాఖలో జాయ్ జమీమాను అరెస్టు చేశారని తెలుసుకుని హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చి.. ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ ఘటనపై భీమిలి, పీఎంపాలెం, కంచరపాలెం పోలీస్ స్టేషన్ తో ఫిర్యాదు చేశానని.. కొత్తగా ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసినట్లు చెబుతున్నాడు.

Also Read :  హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్

#crime #vizag #joy-jemima
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe