Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్‌ అరెస్ట్

ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

New Update
Jogi Ramesh arrested in fake liquor case?

Jogi Ramesh arrested in fake liquor case?

Jogi Ramesh: ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఉదయమే ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటికి సిట్‌ బృందం వెళ్లింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకుని భవానీపురం పీఎస్‌కు తరలించారు.

అరెస్ట్ కు ముందు జోగి ఇంటివద్ద హైడ్రామా చోటు చేసుకుంది. జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అనంతరం ఆయనను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు