జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ట్రిపుల్ ఐటీ, నిట్‌లు వంటి ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025ను మే 18న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐఐటీ కాన్పుర్ సోమవారం తెలిపింది. Also Read: హైదరాబాద్‌లో "అగ్నివీర్" రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు! రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ కాగా ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మే 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ పేపర్ నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్ అందువల్ల ఐఐటీల్లో సీటు కావాలంటే అభ్యర్థులు కచ్చితంగా ఈ రెండు పరీక్షలు రాయాలి. ఈ పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరుగుతుంది. ఈ పరీక్షకు అటెండ్ అయ్యే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://jeeadv.ac.in/ అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించాలి. Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! మరోవైపు జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2 లక్షల 50 వేల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అన్ని క్యాటగిరీల విద్యార్థుల్లో వీరు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్.. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 2000 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. దాదాపు ఐదేళ్ల వరకూ సడలింపు ఇచ్చారు. ఇక ఫీజు విషయానికొస్తే.. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు భారీ ఫీజు చెల్లించుకోవాలి. అన్ని కేటగిరీల్లో బాలికలతో సహా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1,450.. అలాగే ఇతర అభ్యర్థులు రూ.2,900 చెల్లించాలి.