Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం!

ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు.

New Update

ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు అక్రమ నిర్మాణాల పై కొరడా ఝుళిపిస్తున్నారు.  అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి బంధువులకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. మచిలీపట్నం మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో గతవైసీపీ ప్రభుత్వ హయాంలో 180 అక్రమ కట్టడాల నిర్మాణం జరిగినట్లు  అధికారులు సమాచారం అందుకున్నారు. మడుగు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించినా గత పాలకులు వాటిని పెడచెవిన పెట్టారు. 

ఈ ప్రభుత్వ స్థలాలు పేదలకు మంజూరు చేయడంతో పాటు వారితో షెడ్లు వేయించారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మచిలీపట్నం మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణలను నేలమట్టం చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు, షెడ్లు కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు