MOU For Two Pumped Storage Projects: ఏపీలో రెండు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదరనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (AP GENCO), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) సంయుక్తంగా.. ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగా వాట్లు., అనంతపురం జిల్లాలోని కమలపాడులో 1950 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు పీఎస్పీలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణానికి రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయి.
/rtv/media/media_files/2025/11/15/fotojet-99-2025-11-15-16-37-55.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/CM-Jagan-visit-to-Vijayawada-jpg.webp)