అలాంటి వాళ్లని వదిలిపెట్టేది లేదు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నసామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. By B Aravind 09 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమె అధ్యక్షతన శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ మిస్సింగ్ కేసుల్లో గాలింపు చర్యలపై వేగం పెంచాలన్నారు. ఎలాంటి అఘాయిత్యం జరగముందే పట్టుకునేలా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇలాంటి కేసులలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఛార్జీషీట్లు వేయడం, నిందితుల అరెస్ట్ లలో జాప్యం లేకుండా చేసి నేరాలను నియంత్రించడంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఇకనుంచి చిన్నారులు, మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసులలో ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. Also Read: డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్! రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల యాంటి నార్కొటిక్ టాస్క్ ఫోర్స్ బృందం అక్రమంగా రవాణా చేస్తున్న 25,251 కేజీల గంజాయిని పట్టుకోవడాన్ని హోంమంత్రి ప్రశంసించారు. ఈ కేసులో 373 వాహనాలను స్వాధీనం చేసుకోవడం, 2,237 మంది నిందితులను గుర్తించడంలో పోలీసుల కృషిని మెచ్చుకున్నారు. ఒడిషా సహా రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాని అదుపు చేయడం కోసం టాస్క్ ఫోర్స్‌ని మరింత కట్టుదిట్టంగా తీర్చిదిద్దాలన్నారు. డ్రగ్స్ మూలాలున్న ప్రతి కేసుపట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. పదే పదే గంజాయి రవాణాకు పాల్పడే వారికి ఒక గట్టి హెచ్చరికలా చర్యలుండాలన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. అసభ్య పదజాలం, మహిళలు చెప్పుకోవడానికి కూడా వీలుపడని అశ్లీల పోస్టులతో పేట్రేగిపోతున్న కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక పోలీస్ చట్టాలను ప్రయోగించి ఇకపై సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా వ్యవహరించే వారికి సందేశమిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాలలో సీసీ కెమెరాలకు సంబంధించి డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా అన్ని ప్రాంతాలను సీసీ కెమెరాల పరిధిలోకి తేవడానికి చర్యలు చేపట్టాలన్నారు. Also Read: RTV రిపోర్టర్‌పై దాడి.. మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యం మంత్రి అనిత ఆదేశాల ప్రకారం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతతో వ్యవహరించనున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతున్న కేసులు సహా కీలక, సున్నితమైన కేసులలో వేగం, జవాబుదారీతనంతో ముందుకెళతామన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, అదృశ్యమైన కేసుల ఛేదన దిశగా మరింత శ్రద్ధ పెడతామన్నారు. జిల్లాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం, ప్రజలను వాటి పరిధిలో నిఘా పెట్టి నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇక ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా, సీఐడీ ఏడీజీ రవిశంకర్, యాంటి నార్కోటిక్ చీఫ్ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. #andhra-pradesh #telugu-news #ap-home-minister-anitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి