AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో సోమవారం కూడా ఏపీలో వర్షాలు కురవనున్నాయి.ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.

AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!
New Update

AP Rains: బంగాళాఖాతంలో ఫెంగల్‌ తుపాన్‌ తీరం దాటినప్పటికీ ఏపీ పై తుపాన్‌ ప్రభావం ఇంకా వీడలేదు. ఇంకా పలుచోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఫెంగల్ తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌ తగ్గాలంటే ఈ చిన్న పని చేయండి

 ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. సోమవారం కూడా చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ఇచ్చారు. వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు.

Also Read: Pushpa 2 : టాలీవుడ్ లో బాయ్ కాట్ 'పుష్ప2' ట్రెండ్.. కారణం అదే!

విద్యాసంస్థలకు సెలవు..

చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లావాసులు కూడా సెలవు ఇవ్వాలని అధికారులను అడుగుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.మరోవైపు తుపాను కారణంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానపడుతుంది.

Also Read: తండ్రి పాత్రలో చిరంజీవి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో?

దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మత్స్యకారులను సోమవారం చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, మిట్టూరు, పుత్తూరు, పెనుమూరులో భారీ వర్షం పడింది.కలవకుంట ఎన్టీఆర్‌ జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరటంతో నీటిని కిందకి వదులుతున్నారు.

Also Read: రేవంత్ పాలనలో క్షీణించిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు.. హరీష్ రావు ఫైర్

ఫెంగల్ తుపాను కారణంగా కురిసిన వర్షాలతో రైతులకు నష్టం కలుగుతోంది. చిత్తూరు జిల్లాలోని మామిడి, టమాటా, పూలు, ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడింది. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షాలు రావటంతో దిగుబడిపై తీవ్ర  ప్రభావం ఉండనుందని రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe